Friday, January 15, 2016

జగమంతకుటుంబం నాది ...శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట!

శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట!
.
జగమంతకుటుంబం
పాట
పల్లవి : జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది
సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే
చరణం : కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై
మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో
పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల
నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కలల్ని,కథల్ని ,మాటల్ని , పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని
కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని //జగమంత//
శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు . కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్ఛిన ఘనత ఆయనదే .
1+1 × 1-1 = 1
రెండు ఒకటి
( X+1 × X-1)+1 × ( 1 )-1 = 1
పై సమీకరణంలో ‘1’ రెండుగా (1+1 × 1-1) విడిపోయింది . రెండిట్లో ఒకటి (1+1) తిరిగి, క్రింది సమీకరణంలో , రెండుగా అనేకం(X+1 × X-1) గా మారిపోయింది . (X) స్థానంలో ఏ సంఖ్యనైనా ప్రతిక్షేపించుకోవచ్చు .సృష్టిలో ఉన్నది ఒకటే నని అదే రెండుగా అనేకంగా మారిపోయిందని అద్వైత తత్వసారాంశం ఈ తత్వానికి ఆదిశంకరాచార్యలు ఆద్యులు.ఈ అద్వైత తత్వానికి ఫై సమీకరణం 'skeleton' అయితే దానికి రక్త మాంసాలు కల్పించి ప్రాణం పోసింది శాస్త్రి గారి పాట. నవరసాలకు మూలమైన తత్వం ఈ పాటలో ఉంది .
( X+1 × X-1)+1 × ( 1 )-1 = 1
జగమంతకుటుంబం ఏకాకిజీవితం నేను(నాది)
జగమంతకుటుంబం : (X+1 × X-1) లో X బదులుగా (కవి ×కవిత),(భర్త × భార్య),(భగవంతుడు × భక్తుడు) ....ఇలా ఒకరికొకరు వరసైన జంటలను ఎన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. కానీ ఏవరసకావరసే.తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ఏమాటకామాటే . ఒక వరస పనిచ్తేస్తున్న సమయంలో రెండోది పనిచెయ్యదు . అలా ఏ వరసకు ఆ వరసను , ఏ రసానికి ఆ రసాన్ని విడివిడిగా గుర్తించడమే సామరస్యం .

(2+1 × 3-1) ≠ 1

ఫై సమీకరణంలో 2 వేరు ,3 వేరు . అందువల్ల అవి ఒకటి కాలేదు (≠ 1) అలాగే మనిషి మాటలకు చేతలకు పొంతన లేకపోతే అతడు ‘వ్యక్తి’ కాలేడు .‘వ్యక్తి’త్వ లోపం వంచనకు,ఆత్మవంచనకు,సంఘర్షణకు దారితీస్తుంది . ఐక్యమత్యమే బలం అన్నట్టు మనస్సు,వాక్కు,కర్మ మూడింటికి పొంతన కుదిరి ఐక్యం (ఒకటి)గా ఉంటేనే నైతిక బలం సిద్దిస్తుంది. మనోవాక్కయకర్మలలో ఏకత్వమే చిత్తశుద్ది ,నిజాయితీ.

2 +1 × 2 –1 = 1
3 +1 × 3 –1 = 1
ఫై సమీకరణాలు రెండింటిలోనూ ఏకత్వం ,ఒకటి( 1) ఉంది .కానీ రెండు సమీకరణాలు ఒకలా లేవు. భిన్నంగా ఉన్నాయి . అలాగే ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు . ఉదాహరణకు శ్రీరాముడు,శ్రీకృష్ణుడు.వీరిద్దరిలోను, ఫై సమీకరణాల్లో లాగే ఏకత్వం-మనోవాక్కయకర్మలలో ఏకత్వం -ఉంది . కానీ ఇద్దరి జీవితమార్గాలు ఒకలాలేవు . విలక్షణంగా ఉన్నాయి. కారణం వారు ఏకత్వానికి,చిత్తశుద్దికి ప్రాధాన్యత యిచ్చి,అలావుండడానికి నిరంతర సాధన చెయ్యడం వల్ల ఆసాధన ఫలితం ఒక విలక్షణ జీవితవిధానంగా దానంతట అదే రూపుదిద్దుకుంది .ఈ విలక్షణత అంతవరకు కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయాన్ని సమర్ధించవచ్చు ,లేదా వ్యతిరేకించవచ్చు . అలాకాకుండా ముందే ఏదో ఒక జీవితవిధానాన్ని ఆదర్శంగా పెట్టుకుని తదనుగుణంగా జీవించడం మొదలుపెడితే అది స్వభావానికి,పరిస్థితులకు విరుద్ధమై , మనోవాక్కయకర్మలలో ఏకత్వాన్ని (integrity)పోగొట్టి అస్థిత్వాన్నే భంగపరుస్తుంది.అస్తిత్వంతో ఉండడమంటే ఏకత్వంతో ఉండడమే .అప్పుడే వ్యక్తిత్వము,విలువలు ,స్వేఛ్చ సిద్ధిస్తాయి . “Is it true?” అని కాక “Is it true for me?” అనేది ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది .
ఏకాకిజీవితం : ‘జగమంతకుటుంబం నాది’ అనుకునేవాడికి ఏకాకిజీవితం తప్పదు . ఎందుకంటే అతడు ఏ వర్గంలోను,వ్యవస్థలోను,వ్యక్తులతోను చేరడు . కాబట్టి అతడు ఏకాకి, సన్యాసి. ఎందులోనూ చేరడు కాబట్టే అందర్నీ కలుపుకుపోగలడు . అందువల్ల అతనిది జగమంతకుటుంబం ,సంసారసాగరం .
నేను (సృష్టికర్త ): సంక్షిప్త రూపం లో ఉన్న 1 విస్తృత రూపం దాల్చి (X+1 × X-1) అయినట్లు , సూక్ష్మరూపంలో వుండే విత్తనం స్థూలరూపం పొంది వృక్షం అవుతున్నట్టు ,ఏకాకిగా వున్న 'నేను' ఇంతితై వటుడింతయై అన్నట్టు విశ్వమంత అయ్యాను . ఏకాకియైన శ్రీకృష్ణుడు ,తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు .
1 లో ( X+1 × X-1)వున్నట్టు ,విత్తనంలో వృక్షం దాగి వున్నట్టు , ఏకాకి లో విశ్వం ఇమిడి వుంది . ఏకాకి ఐన శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తనలోనే (నోట్లోనే ) విశ్వాన్ని చూపించాడు .
విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation)కనుక జగమంతకుటుంబం నాది . విశ్వం నాలో లీనం (లయం ) అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితం నాది . ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం. భిన్నత్వంలో ఏకత్వం ఏకాకిజీవితం.
ఏకాకిగా వున్నసృష్టికర్త కవిగా ,కవితగా ,భార్యగా ,భర్తగా ............సృష్టిగా మారి జగమంత అయ్యాడు . మట్టి, కుండగా మారినట్టు సృష్టికర్తే సృష్టిగా మారాడు . మాధవుడే మానవుడయ్యాడు . నరనారాయణులు ఒక్కరే . నరుడే నారాయణుడు .
నరుడు ప్రేమికుడిగా,భావుకుడిగా ,భక్తుడిగా ఉన్నపుడు పాడుకోవడానికి ప్రేమగీతాల్ని, భావగీతాల్ని,భక్తిగీతాల్ని ఇంతవరకు కవులందరూ వ్రాసారు . కానీ నరుడు నారాయణుడిగా వున్నపుడు పాడుకునే భగవద్ గీత శాస్త్రి గారి 'జగమంతకుటుంబం'
ఉన్నది ఒకటే నని ,రెండుగా కనిపిస్తున్నవన్నీ ఒకే దానికున్న రెండు పార్శ్వాలని అద్వైతతత్వ సారాంశం.మనిషి ఏ పార్శ్వంలో ఉన్నా,జ్ఞాననేత్రంతో రెండో పార్శ్వం యొక్క ఉనికిని,దాని విలువను గుర్తించగలడు .
లౌకిక జీవితాన్ని ,ఆధ్యాత్మికతను వేరు వేరుగా చూసేవారికి ఆ రెండిట్లో ఏ ఒక్కటీ, ఎప్పటికీ పూర్తిగా అవగాహనకు రాదు . అద్వైతం లౌకికజీవితానికి అధ్యాత్మికతను జోడిస్తుంది . ఇహపరాలను రెంటినీ ఒక్కటి చేస్తుంది .

By Vinjamuri Venkata Apparao

Tuesday, October 14, 2014

జగమంత కుటుంబం నాది

ఒక సినిమా పాటను కర్మ సిద్ధాంతము వివరించటానికి ఉపయోగించిన కారణము
కళ్ళతో చూసేది మనస్సుకు త్వరగా హత్తుకుంటుంది. చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ఏదైనా సంఘటనలో మనం లీనమైపోతే హృదయం ద్రవిస్తుంది. అలా ద్రవించినా మనస్సు కన్నీళ్ళ రూపములో జారినప్పుడు మనం అనుభవించాల్సిన కర్మ మాయమైపోతుంది. దీనికి కారణం ఏమిటంటే ఒక బాధను నువ్వు అనుభవించాల్సి ఉంది, అది ప్రస్తుతం అనుభవిస్తున్నది కాని, భవిష్యత్తులో అనుభవించాల్సినది కాని. కానీ అది నువ్వు ఫిజికల్ గా మొత్తం అనుభవించకుండానే మెంటల్ స్టేట్ లో అనుభవించేశావు. అందువలన నువ్వు అనుభవించాల్సిన కర్మ (result) నీ బాధ అక్కడితో అయిపోయింది.     
జగమంత కుటుంబం పాటలో మనం ముఖ్యంగా చూడగలిగేది ఆగామి కర్మ. నిశ్చిత ఫలితమును (results) ఇచ్చు శారీరిక కర్మలను ఆగామి కర్మలు అంటారు. శారీరిక కర్మ వెనకాతల ఏ మానసిక బంధము లేకుండా శరీరము ద్వారా శరీరము కొరకు చేయు కర్మలను ఆగామి కర్మలు అంటారు. వీటికి ఫలితము ఇచ్చుటకు అధిక సమయము తీసుకొనబడదు. సాధారణముగా నిత్య జీవితములో చేసే కర్మలు రోగముల రూపములో పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆల్కహాల్, సిగిరేట్ అలవాటు ఉన్నవాళ్ళు కేన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అటువంటి అలవాట్లు లేకపోయినా ఒక్కొక్కసారి పూర్వజన్మలో చేసిన కర్మల ఫలము ఈ జన్మలో అనుభవిస్తూ ఉండవచ్చు.   
చక్రం సినిమా పరంగా చూసుకుంటే హీరో రోగగ్రస్థమైన కేన్సర్ అనే ఒక శారీరిక వ్యాధి తనకు ఉంది, తను ఎక్కువ కాలం బ్రతకడు అని తెలుసుకొని ఇంటి నుండి పారిపోయి సమాజములోకి వస్తాడు. అక్కడ సమాజ సేవ చేసి, అక్కడ కాలనీలో వారి మనసులను మార్చటంతో కధ ముగుస్తుంది. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పి వారిని సంతోషంగా, నవ్వుతూ ఉంచటం అనేది ఆ హీరో చేసిన పని. ఆ పని అతని తండ్రికి, పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయికి, ఆ సమాజములో ఉన్న మరొక అమ్మాయికి నచ్చి ఆ కార్యక్రమమును అతని తర్వాత కూడా కొనసాగిస్తారు. ఇది సినిమాలోని కధ.
ప్రస్తుత కాలములో మన ఇంటిలో ఉన్న ఒక వ్యక్తిలో మార్పు తేవటానికే మనకు కొన్ని సంవత్సరాల కాలం పడుతోంది. అలాంటిది కేన్సర్ తో కొన్ని రోజులలో చనిపోయే వ్యక్తి వెనువెంటనే ఒక కాలనీలో ఉన్న వ్యక్తులందరి మనస్సులను మార్చగలాడా? అంటే ఇక్కడ కాలముతోపాటు అతని జీవిత కాలము పొడిగింపబడినది. ఎప్పుడైతే తనకోసం కాకుండా, ఏ ఫలాపేక్ష లేకుండా సమాజానికి ఏదైనా చేద్దాము అని అనుకున్నాడో అప్పుడే అతని వ్యాధి మాయమైపోయింది. సమాజానికి తన ప్రతిభను ఇవ్వడం ద్వారా ప్రకృతి అనుభవించాల్సిన కర్మ నుండి అతనిని విముక్తుని చేసింది. సినిమా కాబట్టి అతను తర్వాత చనిపోయాడని చూపించినా అతను అంత చిన్న వయస్సులో చనిపోయి ఉండడు. అతని జీవిత కాలము చాలా చాలా సంవత్సరములు పొడిగింపడి ఉండవచ్చు.  నిజానికి అతను చనిపోలేదు. అతను చేసిన పనులు మరికొందరికి ఇవ్వటం ద్వారా వారి చేతలలో బ్రతికే ఉన్నాడు. ఇదే ఈ పాట యొక్క లాస్ట్ చరణములో చెప్తాడు.
మందులులేని భయంకరమైన వ్యాధులను మనం చేసే కర్మల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఈ పాటలో, ఈ సినిమాలో చూపించబడింది. దీనినే పరమ పూజ్య గురుదేవులు తన క్రాంతి ధర్మీ సాహిత్యము మూడవ పుస్తకమైన యుగేచ్చ ప్రతిభా పరిష్కారము – 1 పేజీ 7 లో “మనోబలము యొక్క ప్రచండశక్తి మరియు దాని యొక్క పరిణితి లో వివరించారు. ఈ పుస్తకం ఆ సినిమా కంటే చాలా సంవత్సరముల ముందు వచ్చింది.   
జగమంత కుటుంబం నాది
వసుధైక కుటుంబం అన్నది భారత దేశం తాలుకు మౌలిక స్వరూపం. భూమి మీద జీవించే మొత్తం జీవజాలమంతా కూడా  ఒకే కుటుంబం అనే concept, భావం. ఈ భావము మనిషికి మాత్రమే కలుగుతుంది. జంతువుకి  మనిషికి తేడా ఎక్కడంటే ప్రాకృతికమయిన జీవితం కాకుండా ఇంకేదో ప్రత్యేకత కలిగి ఉండబట్టి మనిషి జంతువు అయినప్పటికి (man is a social animal) మిగిలిన జీవరాశుల కంటే వేరైనాడు. అది ఏమిటో పట్టుకోగలిగితే అలా ప్రత్యేకముగా ప్రవర్తిస్తున్నామా లేదా అనే దాని గురించి చెప్పగలుగుతాము.
ఏకాకి జీవితం నాది
ఏకాకితనం అంటే ఎవరూ లేని అనాధతనం కాదు, పరిపూర్ణమైనటువంటి base, మూలం, అదే  ఏకాకితనం. ఇది అంతా మొత్తం నాది అనుకోగలగటం, అనుకొని  అక్కడ  తాలూకు వైవ్యక్తిక మూలం (individuality) ఏది అన్నది తెలుసుకోవటం. అంతా  నాది ఇదంతా  నేనే, నేనొక్కడినే అనుకోవటం, అనుకొని అందరిలో తనని, తనలో అందరిని చూసుకోగలగటం. ఇలా అనుకోవటం వలననే మనం గురువుల దగ్గరకు వెళ్ళినప్పుడు మన మనసులో ఏముందో వాళ్ళకు తెలిసిపోతుంది. మనం ఆ స్థితిలో ఉండము కాబట్టి మనకు ఏమీ తెలియదు.
కొంత వరకు మన కుటుంబములో దీనిని చూసుకోవచ్చు. ఎందుకంటే కుటుంబమే మన ప్రపంచము అని అపోహలో ఉంటాము కాబట్టి. మన ఇంటిలో వాళ్ళు, మన పిల్లలు, బంధువులు, స్నేహితులు వాళ్ళు ఏమి ఆలోచిస్తారో కొంతవరకు మనకు ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. దీనికి కారణం వాళ్ళు ఏది ఫీల్ అవుతారో అది మనం ముందుగానే ఫీల్ అవటం. దీనికి కారణం వాళ్ళు నేను కూడా ఒకటే అన్న భావన రావటం వలన.
సంసార సాగరం  నాది
మేఘలనుంచి నదులొచ్చి, ఆ నదులు మళ్ళీ సాగరంలో కలసి, ఆ సాగరం మళ్ళీ ఆవిరై, అవి మేఘాలయిఅక్కడి నుంచి మళ్ళీ వర్షమై ఇదంతా చేస్తోంది సుర్యుడొక్కడే. మొత్తం ఇన్ని ఋతువులకి ఆధారము ఆ సూర్యుడే. జగత్చక్షువు అని పేరు సుర్యుడికి. మొత్తం ప్రకృతిని అంతా నడిపిస్తోంది  సుర్యుడే. ఇవన్నీ చర్చించే  తాత్వికత  సంసార సాగరం నాది.
సూర్యునిలాగానే ప్రతి వ్యక్తి యొక్క జీవితము ఈ చక్రములోనే నడుస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి పని inter linked. సాగరుడికి రత్నగర్భుడు అని పేరు. అంటే రత్నాలను తన గర్భములో దాచుకున్నవాడు అని. ఈ సంసారము అనే సాగరములోనే రత్నాలు ఉంటాయి. అవి మనం చేసే పనులు. మనం ఫలితమును ఆశించకుండా కర్మను (పనులను) చేస్తే ఆ సాగరములో రత్నాలు దొరుకుతాయి. బాధ్యతల నుండి పారిపోయే వారికి ఇవి దొరకవు. ఆ బాధ్యతా రాహిత్యం మళ్ళీ ప్రారబ్ధ కర్మగా వస్తుంది. దీనికోసమే గురువులుమీ కుటుంబానికి మీరు ట్రస్టీ మాత్రమే, మీ బాధ్యతలు మీరు చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే అంతా నీదే కానీ నీది ఏదీ లేదు.
సన్యాసం  శూన్యం  నాది
సన్యాసం, శూన్యం అనగానే రెండూ నిరాశలాగా అనిపిస్తాయి కాని సన్యాసం అంటే అంతా పోగొట్టుకోవటం, విడిచిపెట్టటం కాదు. శూన్యం అంటే ఉపనిషత్తులలో చెప్పింది ఏమిటంటే పూర్ణంలో నుంచి పూర్ణం పుట్టింది, అది కూడా పూర్ణమే ని. ఆకాశాన్ని శూన్యం అంటాం పరిపూర్ణ విశాలతకి, సంపూర్ణతకి అర్ధం కూడా శూన్యమే. సన్యాసం అంటే అంతా వదిలేయటం కాదు. అంతా నాది అనుకోవటం. చాలామంది మహాపురుషులు సన్యాసాశ్రమం స్వీకరించటం ద్వారా మనకు జ్ఞానాన్ని ఇచ్చారు, బోధనలను చేశారు.  సన్యాసం స్వీకరించిన వాళ్ళు ప్రపంచాన్ని వదులుకొని వెళ్ళిపోలేదు. నేను అంటుకోను, (అపరిగ్రహం) నాది అంటూ ఏమీ  లేదు అనుకున్నారు, కానీ నాకున్నదంతా నేనే, ఇదే ఇస్తున్నాను అన్న తత్వం. ఇదే సూర్యుడు చేసే పని కావ్య కర్త కావ్య భర్త. ది సూర్యుడికి ఎలా  apply  అవుతుందో చరణాలలో చూద్దాము.
కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో  పన్నీటి  జయ గీతాల కన్నిటి  జలపాతాల
కవి వ్యక్తిగా చెప్తున్నాడు. భార్యగా, భర్తగా, ఒక మనిషిగా  నాకు కీర్తి వస్తుంది. నేను జీవితం  అనుభవిస్తున్నాను. కష్టాలు వస్తాయినష్టాలు వస్తాయి, భాధలు వస్తాయిభయాలు వస్తాయివీటన్నిటితోపాటు నేను అనుగమిస్తున్నాను అంటే కలసి నడుస్తున్నాను.
మల్లెల దారిలో వసంతాన్ని చూసి నేను ఎంతగా ఆనందించానో మంచు ఎడారిలో శిశిరాన్ని కూడా అంతే positive గా తీసుకుంటాను. నిరాశావాదంఆశావాదం ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు. ఒకదాని తరువాత ఒకటి. ఈ చక్రం అలా నడుస్తూనే ఉంటుంది. మల్లెల  దారిలో వెళ్తునప్పుడు పన్నీటి జయగీతాలు ఎదురవుతాయి.   సన్మానాలు, సత్కారాలు వగైరా వగైరా. మంచు ఎడారిలో నడుస్తున్నప్పుడు, ఆ ఏకాంతంలో జ్వలిస్తున్నప్పుడు. మనం అనుభవిస్తున్న బాధ మరొకరికి తెలియనప్పుడు మంచు ఎడారిలో  కన్నీటి జలపాతాలు అవుతాయి. వీటన్నిటిలోను నేను ఒక్కడిని. ఒకటి కాకితనం కాదు, పూర్ణం. అందులోంచే సమస్తం మొదలైనాయి, పుట్టుకొచ్చాయి. ఈ ఒక్కచోటే పుట్టుకొచ్చాయి అందులోనే కలుస్తాయి మిగిలినవన్నీ. సుఖాలు ఆ సంసారలోనే, బాధలు దానిలోనే. ఒకదాని తర్వాత ఒకటి కాలచక్రములా అవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే రెండింటిని సమానంగా స్వీకరించి భావనారహిత స్థితికి వెళ్తామో అప్పుడు అక్కడ అవి రెండూ ఉండవు.
నాతోనేనే అనుగమిస్తూ
ఇద్దరు లేరు అని చెప్పటం, రెండు ఉన్నాయి అని చెప్పటం. రెండు అనేది భావము దాని తాలూకు అభివ్యక్తి (CONCEPT, EXPRESSION). ఇది మనిషికి ఎలా connect అయింది అంటే మన సంఘం ఎలా ఏర్పడింది? సమాజం ఎలా ఏర్పడింది? మనిషిగా మన పుట్టుక నుంచి మన ప్రయాణం ఏమిటి? సాంఘిక జీవనం ఏమిటి? వ్యక్తిగత జీవనం ఏమిటి? ఇన్ని complex లతో మనిషి తనను తాను గుర్తించుకోగలగాలి. మొదట మనిషిగా తన మూలాన్ని గుర్తించాలి. వ్యక్తిగా సమాజంలో తన మూలాన్ని గుర్తించగలగాలి. Correct గా అనుసంధానం చేసుకోగలిగితే  రెండూ కూడా తనే. రెండు రూపాలు సాంఘికం జీవితం  మరియు వ్యక్తిగత జీవితం. కానీ అంతా ఒక్కటే .
నాతో నేనే రమిస్తూ ఒంటరినై  అనవరతం  కంటున్నాను  నిరంతరం 
బ్రోచేవారెవరురా పాటలో ఒక మాట ఉంటుందిరమించువారెవరురా రఘువరా నినువినా అని. వాడుక భాషలో రమించడం అంటే సంగమించడం. కానీ రమించడం అంటే ఆనందించటం, ఆనందింపచేయటం.  జ్వలనలో ఆనందమేమిటి? అది విపరీతమయిన, తీవ్రమయిన దహనము. సూర్యుడు అంటే నేను (self) అందులో ఆనందించలేకపోతే  నా అణువణువుని ఒక అగ్నిగోళంగా మార్చుకోలేకపోతే, కిరణాల్ని ఇవ్వలేను.  ఇవ్వటంలో, ఆ వదులుకోవటంలోఆ త్యాగంలో సన్యాసంలో ఇవ్వడం ద్వారా వెలుగుఆ వెలుగు ద్వారా ఈ మొత్తం ఋతువులు, ఋతువుల ద్వారా ఈ భూమిలో జీవంఇన్ని కలిగించే ఆనందాన్ని అనుభవించడం. అలా సూర్యునిలా మనిషి తన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మలచుకోవాలి. 
కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని
కవికి బ్రహ్మ అని పేరు.  సృష్టి కర్త అని పేరు. అలాగే కవి నిరంతరం భావాల్ని కంటూ ఉంటాడు కృతికర్త, కృతిభర్త. కావ్య కన్యల్ని ఎందుకు కంటూ ఉంటాడు? భారతదేశములో తన వంశాన్ని వృద్ధి  చేయాలనుకోవటం ఒక స్వార్ధం. ఆడపిల్లల ఇంటిపేరు మార్చి ఇంకొకరికి  దానం ఇవ్వటంలో ఉద్దేశ్యము మగపిల్లవాని వంశాన్ని వృద్ధి చేయటానికి. వరున్ని విష్ణుస్వరూపునిగా భావించి  కన్యని లక్ష్మిదేవిగా భావించి కాళ్ళు కడిగి  కన్యాదానం చేస్తున్నాము. కన్యాదానం అంటే ఇవ్వటం ద్వారా ఇంకొకరి వంశాన్ని వృద్ధి చేయటం. అంటే మన ఆలోచనలను ఇంకొకచోటకి పంపటం ద్వారా అక్కడ బీజాలు వేయటం. ఆ నాటటం ద్వారా అవే ఆలోచనలు కలిగిన మరికొంత మందికి జన్మ ఇవ్వటం. అంటే భావాల్ని ఇతరులకు ఇవ్వటం ద్వారా, వాళ్ళు వాటిని స్వీకరించటం ద్వారా ఆ భావాలకు  సంబంధించినటువంటి  ఆలోచలనల  వృక్షాలను  మొలకెత్తించటం. ఆడపిల్లల్ని అంటే ఈ భావాలన్ని నేను మీకోసం ఇస్తున్నాను. కేవలం ఒక్క మనిషి కల కనబట్టే సంఘం ఏర్పడింది. ప్రకృతినించి మనిషిని వేరుచేసేది దో ఇక్కడ ఇమిడి ఉంది. కలల్ని కంటున్నాను. కధల్ని, అంటే చరిత్రని. నా పూర్వం ఏమి జరిగిందిదాని నుండి ఏమి నేర్చుకోవాలి? మనం ఏమి మాట్లాడుకుంటున్నాం? ఏమి మాట్లాడుకోవాలిఅసలు ఆనందాన్ని పూర్తిగా మర్చిపోయాము. మనకున్న బాధలు ఎప్పుడూ గుర్తుకువస్తాయే తప్ప మిగితావారికంటే మనమెంత ఆనందముగా ఉన్నామో ఎవరికీ ఎప్పుడూ గుర్తుకు రావటం లేదు. నిరంతరం ఆ నెగటివ్ ఆలోచనలను ఆలోచించటం ద్వారా వాటిని మనం జీవితములోకి దింపుకుంటున్నాము.
రంగుల్ని రంగవల్లుల్ని
రంగుల్ని రంగవల్లుల్ని అంటే నా జీవితాన్ని నేను లా అలంకరించుకోవాలి ? ఎందుకు అలంకరించుకోవాలి? కల ఎందుకు కన్నాము? ఈ ఆనందాలెందుకు? ఈ ఏడుపులెందుకు? అలంకరణలు ఎందుకుమనం మన జీవితాన్ని అలంకరించుకొంటున్నామా? లేక పాడుచేసుకుంటున్నామా?   భావలన్నింటినీ మీకు అంకితం చేస్తున్నాము అంటే కన్యాదానం చేస్తున్నాము. ఇది కవిగా thinking and feeling.
రంగుల్ని రంగవల్లుల్ని అంటే ఇంకొక అర్ధం ఏమిటంటే రంగులలాగే మన జీవితము కూడా ఉంటుంది. అన్నీ రంగుల మిశ్రమము తెలుపు, ఏ కలయిక లేనిది నలుపు. రంగుల మిశ్రమములలో తేడాల వలన వివిధ రంగులు ఏర్పడతాయి. అలాగే మన ఆలోచనలలో తేడాల వలన ఫలితాలు వస్తాయి. ఎలాగైతే రంగవల్లికలలో (ముగ్గులో) వివిధ రంగులు బాలన్స్డ్ గా వాడతామో అలాగే మన జీవితములో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి జీవితాన్ని అందముగా మలచుకోవాలి. అందరితో కలవటం కానీ ఒంటరిగా ఉండటం. రంగులు అన్నీ రంగులతో కలసే ఉంటాయి. కానీ దేని ప్రత్యేకత దానిదే.
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
ప్రాణశక్తి   అనేది నిరంతరం అణువులలో కలిగేటటువంటి జ్వలనం    ఉచ్వాసం ఏదయితే ఉందో, వేడి శరీరములో minimum ఉష్ణోగ్రత లేకపోతే మనిషి  జీవితమే లేదు.  ప్రాణశక్తి తాలుకు ఆ వేడి, ఆ వెచ్చదనం,  ఆ జ్వలనం లేనిదే చూపు కూడా చుడలేము. చూసేది కన్ను కాదు దాని వెనకాల ఉన్నటువంటి ప్రాణచైతన్యం, చైతన్యంలో నిరంతర జ్వలనం ఉంటుంది. ఆ వేడిని నేను. ఆ వేడే లేకపోతే ఋతువులు రావు. అలాగే మన కుటుంబానికి మనమే ప్రాణంలాగా మెలగాలి. కానీ మనం ప్రాణం కాకూడదు.
మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై
వెన్నెల అంటే చల్లదనంతల్లిదనం అని అర్ధం. సూర్యుడు పగలు రగిలిస్తున్న  ఈ వేడి వెనకాల మమత ఉంది. అది కనిపించటం లేదు. సూర్యుడు వేడిగా అనిపిస్తాడు కానీ దాని వెనుక అతని కర్తవ్యం ఉంది. రాత్రి పూట నీకు విశ్రాంతి  ఇవ్వటానికి,  నిన్ను చల్లగా నిద్రపుచ్చటానికి  ఈ వెన్నెల ఏదయితే కనిపిస్తుందో అది సూర్యుని మారు వేషం. మన సుఖం సూర్యుని జ్వలనే, సూర్యుని చైతన్యమే. దీనినే పరమ పూజ్య గురుదేవులు క్రాంతిధర్మీ సాహిత్యం రెండవ పుస్తకం అయిన  21 వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ – 2 లో, పేజీ 42 లో సూర్య చంద్ర ధ్యానం గా ఇచ్చారు.
ఇదే కుటుంబములో కూడా కనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఇచ్చే ప్రేమ, ఆప్యాయతల వెనకాతల వాళ్ళుపడే కష్టం, తాపత్రయం ఉంటాయి. వాళ్ళు అనుభవించిన, లేక అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు కనపడవు. కానీ అవి కనిపించకుండా లోపల దాగి ఉంటాయి. ఎదుటి వారిని నుండి స్వీకరించిన కోపతాపాలు అనే వేడిని మళ్ళీ మనం వేరొకరిపైన చూపకుండా మనలోని ప్రేమ, క్షమ అనే చల్లదనాన్ని ఇతరులకు ఇవ్వగలగాలి.    
ఆధ్యాత్మిక పరిపూర్ణతకి కుటుంబమే మార్గము. కుటుంబములో స్వార్ధపూరిత కర్మ చేయకూడదు అన్నది బేసిక్ రూల్. స్వప్రయోజనము కోసము చేస్తే కర్మబంధములో ఇరుక్కుంటాము. మన కుటుంబములోని వారు ఎలా ప్రవర్తిస్తున్నా వారి బలహీనతను క్షమించి సహనముతో, ఓర్పుతో ఉండగలగటం నేర్చుకోవాలి. లేకపోతే దాని వలన జనించే ద్వేషం, పగలాంటి వ్యతిరేక భావనల వలన మనం మళ్ళీ వారితోనే కర్మ బంధములో ఇరుక్కుంటాము.
రవినై శశినై దివమై నిశినై
అంటే సూర్య చద్రులులాగా, పగలు రాత్రిలాగా కుటుంబములోని వారు ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉండాలి అని ఒక అర్ధం. ఇంకొక అర్ధములో పగలు రాత్రిలాగా ఎప్పుడూ గురువుతోనే ఉంటే అంటే భౌతికముగా ఉండటం కాదు గురువుకి సంపూర్ణ సమర్పణ భావముతో ఉంటే జీవితములో వెలుగు, వెన్నెలనే ఉంటాయి తప్ప వేడి, చీకటి ఉండవు. అందుకే గురువును అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు అని అంటారు.
సహగమిస్తూ
అంటే వాడుకలో అర్ధం కలసి పడుకోవటం.  అనుగమిస్తూ అన్న సహగమిస్తూ అన్నా అర్ధం ఒకటే. అంటే గురువుతో కలసి నడవటం. నడవటం అంటే మన నడత గురువులాగా ఉండాలి. గురువు అడుగుజాడలలో ఉండాలి.
ఒంటరినై అనవరతం కంటున్నాను  నిరంతరం
మన జీవిత నాటకానికి స్టేజి మాత్రమే ఉంటుంది. కానీ కధ, డైలాగ్స్, సీన్స్ ఉండవు. అవి అన్నీ మన చేతిలోనే ఉంటాయి. అందుచేత ప్రతి అనుభవముతో పాఠం నేర్చుకోవాలి. మాట్లాడే ప్రతిమాట, చేసే ప్రతి పని నిరంతరం జాగురూకతతో చెయ్యాలి.  
కిరణాల్ని కిరణాల తరుణాల్నితరుణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని
చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇందజాలాన్ని
సమయంలో ఏ కిరణం ఎలా వెళ్ళాలి? ఋతువుకి  కిరణం వెళ్ళాలి? హరిణాలని అంటే లేళ్ళని, ఆ లేళ్ళ తాలూకు పాదాల్ని, ఆ పాదాల తాలుకు  పరుగుని, ఆ పరుగు కనరాని గమ్యాల వైపు పరుగులు తీస్తుంది. వీటన్నింటిని  నేను కని, మీకు అందిస్తున్నాను so that నేను అందించిన వాటన్నింటిని  మీరు అందుకోండి, గమనించండి. అంటే మనం ఆ వేకువలో వేసుకున్న బాటలని, ఆ బాటలో మనం నడుస్తున్న నడకని, నడకలో  ఏ కనరాని గమ్యాలవైపు పయనిస్తున్నాము? మొత్తం అంతా ఇస్తూ ఇచ్చిన తరువాత   శూన్యం అంతా ఎందుకొచ్చింది? అంటే  తానెవరు ? నిరంతరం భావాలను  కని శ్రమిస్తుంటే మన ఉనికి ఎక్కడ ఉంది అంటే personal existence లో. ఒక కిరణాన్ని కని పంపించి మరొక కిరణాన్ని కని పంపించి ఆ రెండింటి మధ్యలో ఏమన్నా ఖాళే ఉంటే అదే, ఆ ఖాళీలన్నీ తనవే, ఒక  భావాన్ని, ఒక ఆలోచనని కని పంపించి మరొక భావాన్ని కని పంపించి రెండు భావాల మధ్య ఖాళీ తనదే. నిజానికి ఆ ఖాళీ ఉండదు.
ఇక్కడ కిరణాలని అంటే మన ఆలోచనలు, చేతలు. ఏం చేస్తున్నాం అవి ఎక్కడికి దారి తీస్తున్నాయి. అవి చివర ఏం మాజిక్ చేస్తాయో. అది +ve కావచ్చు-ve కావచ్చు. ఎప్పుడైతే గురువు లేదా భగవంతుడు ఇచ్చిన పనులను (మన బాధ్యతలను) చేస్తూ ఉంటామో అప్పుడు మన కర్మ నశించిపోయి ఇంద్రజాలాన్ని చూపిస్తుంది అదే పృధ్వీపైన స్వర్గావతరణ. అందరు దేవతలవలే మారిన రోజు. అంటే ఇవ్వటం తప్ప తీసుకోవటం లేని రోజు. దుఖము, స్వార్ధము, అసూయ మొదలైన negative shades లేని ప్రపంచము. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది అక్కడ. ఆలోచన ఎప్పుడైతే వాక్కుగా మారుతుందో అప్పుడు కర్మ physical గా వస్తుంది  
గాలి పల్లకీలోన తరలి నాపాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయినా గుండె మిగిలె
నా హృదయమే  నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి 
నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీ వాలి  
కిరణాలను అంటే మన ఆలోచనలను పంపించిన తరువాత ఉండే ఆ ఒంటరితనములో సినీవాలి అంటే అర్ధం చంద్రరేఖ కనిపించే అమావాస్య + పార్వతీదేవి అని . పార్వతీదేవి ప్రకృతి అని కూడా అర్ధం. అది విషాదం కాదు ఆ విషాదంలో చిన్న silence నిశ్శబ్ధము ఏదయితే ఉందో అది. ఒక భావనికి మరొక భావానికి మధ్య  ఉండే gap , gap లో పడే ప్రసవవేదన ఏదయితే ఉందో అది మాత్రమే నా ఉనికి.
ఇన్ని భావనలను పంపిస్తున్నందుకు, ఇస్తున్నందుకు సంతృప్తి ఏదయితే ఉందో ఒకకంట పన్నీరుమళ్ళీ  ఇంకొక భావాన్ని కనేలోపల ఉండేటటువంటి ఒంటరితనము. అది మనలోపల ఉండే మన existence. అది గుర్తుంచుకోవటానికి ఇష్టపడము. మానసికముగా అక్కడ మన తాలూకు చిన్న ఆవేదన, ఆనందం. అమావాస్య నాడు కనపడే చిన్న చంద్రకళ + ఈ ప్రకృతి + ఈ ప్రకృతిని అంతా చూస్తూ, ప్రకృతితో ఉంటూ కూడా తాను ఒంటరిగా ఉండటం.
సూర్యుని గుండెమంట మనకందనంత ఎత్తులో ఉంది. పగటిపూట మనను నడిపించే నాన్నలాంటి కాంతిని , రాత్రి పూట మన అలసటను చూసి సేదతీర్చే అమ్మలాంటి వెన్నెలని అందిస్తున్నాడు. అలా మనం కూడా ఉండగలిగితే, మండగలిగితే బతికున్న నాలుగు రోజులు నలుగురితో కలసి నలుగురి కోసం జీవితాన్ని ఒక ఆటగాపాటగా ఆనందిస్తాము. నలుగురు అంటే మనుషులను విడివిడిగా చూస్తున్నాము. చెట్టు తాలుకు వివిధ కొమ్మలుగా, ప్రతి ఒక్కడు నేను, నాది అనుకుంటూ మిగిలినవాళ్ళు చాలామంది  ఉన్నారులే అనుకుంటాము. ఒక అద్దాల  గదిలోకి వెళ్తే అనేక ప్రతిబింబాలు మనవే చుసుకుంటాం.  అలాగే ఒక మనిషి  తనలో అందరిని చూస్తూ అందరిలో తన రూపాన్ని చూసుకోగలగాలి. నీకు నచ్చింది ఇవ్వటంతో పాటు, నువ్వు ఏది నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో అది నీకు నచ్చేలా ఇవ్వగలగటం. చేదయిన కషాయాన్ని తేనెతో కలపి   తినిపించడంలాగా.
కాకి జీవనం నాది
అని సూర్యుడి గుణగణాలు చెప్పారు మరి సూర్యుని భార్య ఛాయ  అంటారు కదా ఇవన్నీ మనం మాములుగా పెట్టుకున్న పేర్లు. ఛాయ అంటే నీడ, మన నీడ అదే చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే గుప్తముగా మన చిత్రాలను (కర్మలను) గీసేవాడు.
సౌరకుటుంబం
సౌరమండలం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సూర్యుని తాలుకు తేజస్సు ఆధారంగా సూర్యుడికి ఎంత దూరంలో ఉంటే ప్రాణికోటి ఆవిర్భవిస్తుంది,  నిలబడుతుంది అనేది ఆ [distance] లో మిగిలిన గ్రహాలకి భూమికి ఆ తేడా, ఆ తేడాలతో మనం కూడా ఉండాలి. ఎంత వరకు ఉండాలి, ఎంత వరకు చెయ్యాలి, ఎలా ఉండాలి అని అది వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా కూడా.  ప్రాణికోటిలో దీన్ని అన్నింటిని గమనించే వాడెవరు? ప్రశ్నించేవాడెవరు? మాములుగా మిగిలిన గ్రహాలలాగా, మిగిలిన ప్రకృతిలాగా లేకుండా మనిషే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? మనిషి  తనను తాను గమనించుకుంటే ముందర ఈ భూమిమీద తన ఉనికి ఏమిటి ? విశ్వముతో తనకు link ఏమిటి ? తనతోపాటు ఉన్న ప్రాణికోటితో తన అనుబంధమేమిటి ? అసలు తనేమిటి ? తన తాలూకు సమాజపు ఉనికి ఏమిటి? ఇన్ని ప్రశ్నలకి సమాధనాన్ని అన్వేషించుకోవలసిన అవసరం తాత్వికంగా కాదు భౌతికంగా, సామాజికంగా, సాంఘికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అవసరం ఉంది ఇవాళ. ఆధ్యాత్మికంగా కాక ఇంత మూలానికి వెళ్ళి మనిషి తనను తాను పరిశీలించుకో గలిగితే ఆ ఉనికిని పట్టుకోవచ్చు. కానీ ఏరంగంలోనూ ఎవరు కూడా తన ఉనికిని  పరిశీలించుకోవటం లేదు.        
మనషి తనం humanity గురించి
ఒకటి రెండంటూ  విడిగా లెఖ్హెడితే  తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడు అంకెలు ఎన్నంటే 
పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే అంకెలకైన అందవు సంఖ్యలు  మొత్తం ఎన్నంటే
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే కోట్లు ఒకట్లై ఒంటరితనాన పడి ఉంటామంతే 
నిన్ను నన్ను కలిపి మనం అని అనుకున్నామంటే ప్రపంచ జనాభా కలిపి మొత్తము  మనిషితనం ఒకటే 
ఆరువందల్ల కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ మనిషితనం ఒకటే ఉంది. ఈ మనిషితనాన్ని పరిశీలించటం కోసం ఈ పాట. పైకి ఎన్ని రకాలుగా కనిపించినా మనిషితనం అనేది ఆత్మకు సంబందించిన మాట. నీకు నువ్వు ఏదయిన పనిచేసుకో నీకు సంబందించినంత వరకు ఆపని తప్పకుండా అందరి పని అయితీరుతుంది. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి ఆ  భాష రాకపోయినా నీ భావాన్ని ఈజీగా express చేయవచ్చు. నువ్వు చూసే చూపులో అది కోపమా, స్నేహమా, దైన్యమా, అని తెలిసిపోతుంది.  కానీ భావం మాత్రము [feel] ముందు తెలిసిపోతుంది తరువాత వ్యాఖ్యానం విశ్లేష వస్తాయి.    
కలలు కానీ, భావాలు కానీ ఇంకొకటికానీ వాటిని వ్యాఖ్యానించటానికి శాస్త్రాలు పుట్టాయి కానీ శాస్త్రాల కోసం  ఇవి పుట్టలేదు. సరిగమల కోసం పాట పుట్టలేదు. పాట కోసం సరిగమలు పుట్టాయి. అలాగే ఈ భావాలు, కలలు, కధలు, పాటలు, మాటలు ప్రతి మనిషికి తనదైన సంవిధానంలో ఉంటాయి. Expression తాలుకు difference తప్ప మౌలికమైనటువంటి concept తాలుకు difference ఏమి ఉండదు. ఈ ఒంటరితనము ప్రతి ఒక్కరిలోను తెలుస్తూ ఉంటుంది.  ఒంటరితనం అంటే totality  completeness.  తెలుస్తూ ఉంటుంది ఫీల్ కాగలుగుతూ ఉంటారు కానీ గుర్తించటానికి ఇష్టపడరు. గుర్తించలేకపోతూ ఉంటారు. గుర్తించవలసి వస్తే, గుర్తించగలిగితే ఆ ప్రశ్నని గనక ఎదుర్కోగలిగితే అప్పుడు మనకు [self] ఇతరులకి మధ్య ఉన్న భాందవ్యం అర్ధం అవుతుంది. అప్పుడు అసలు కర్మ ఎలా వస్తోందో, దానిని ఎలా తీసివేయవచ్చో తెలిసిపోతుంది. మనకు సమాజానికి మధ్య ఉన్నది అర్ధం అవుతుంది. నేనెవరో నాకు అర్ధమవుతుంది. ఇంత కల్లోలాలు ఉండవు. ఇంత అనిస్చితస్థితి ఉండదు. ఎక్కడికి  వెళ్తున్నాము ? ఎందుకు వెళ్తున్నాము ?  ఏమిటి చేస్తున్నాము? ఇన్ని ప్రశ్నలు ఉండవు. ఎప్పుడైతే ఆ సత్యం అంతరాత్మతో యుద్ధం చేస్తుందో అప్పుడు అంతరాత్మ గొంతు నొక్కడానికి చాలా మట్లాడుతుంటాం, చాలా పనులు  చేస్తూ ఉంటాం చాలా busy గా కాలాన్ని మార్చేస్తూ ఉంటాం, దీనికి బ్రతుకు పోరాటం అని పేరు పెడతాం. 
ఈ ప్రపంచం అంతా ఒక అద్దం, అది పగిలి ముక్కలై చెల్లా చెదురై ఉంది నేను  కనిపిస్తున్నాను ప్రతి ముక్కలో కానీ ముక్కలై ఉండటం మూలంగా ఒకచోట  ముక్కు కనిపిస్తుంది, ఒకచోట కన్ను కనిపిస్తుంది ఒకచోట చెవి వెంట్రుక కనిపిస్తుంది, ఒకచోట కాలిగోరు. ఒకచోట నా కన్ను కనిపించినా నాకు నచ్చుతుంది, మరొకచోట చికాకుగా ఉంటుంది, ఇంకొక చోట కోపం వస్తుంది, ఇంకొక చోట విరక్తి వస్తుంది ఇవన్నీ నాకు సంభందించినవి. ఎవరిమీద అయినా మనకు కోపం వస్తోంది అంటే ఆ కోపం వారివల్ల కాదు  something నాకు సంబంచిన ఏదో భావంవల్ల (feeling) ఎదుటివాళ్ళ రూపంలో అది కోపంగా వస్తోంది. నాకోపాన్ని నేను గుర్తించగలగాలి , నా ఇష్టాన్ని నేను గుర్తించగలగాలి.   
ఇష్టం అవతలవాళ్ళ వల్ల కలగదు నీవల్లే కలుగుతుంది. ప్రేమ నీకు కలిగింది నీవల కలగలేదు, ద్వేషం నీకు కలిగింది నీవల్ల కలగలేదు, కోపం నీకు కలిగింది, గర్వం నీకు కలిగింది, ఈ అసహాయత నీకు కలిగింది, విరక్తి నీకు కలిగింది, కనుకనే అత్మహత్య నువ్వు చేసుకుంటున్నావు. ఆత్మహత్య చేసుకోమని నీకు ఎవరూ   చెప్పలేదు. నీ situations చెప్పలేదు. ఎప్పుడయితే నిన్ను నువ్వు గుర్తించగలవో, ఈ పగిలిన అద్దం ముక్కలన్నీ అతికించి నిన్ను నువ్వు చూసుకోగలిగితే నీ కోపాన్ని నువ్వు ప్రశ్నించుకోగలిగితే ఆ కోపం, ద్వేషం నీకు ఉపయొగ పడుతోందా నిన్ను భాధపెడుతోందా? ఈ మానవత్వపు base చూడగలిగితే జగమంత కుటుంబం నీది అవుతుంది. ఎవరిమీద నీకోపం? ఎవరిని నువ్వు సాదిద్ధాం అని నీవు ఇంత ఉక్రోషపడిపోతున్నవు? నీ కోపం ఎవరిమీద చూపిద్దాం అనుకుంటావు. ఒక్కసారి నవ్వటానికి ప్రయత్నం చేయి. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోవటానికి ప్రయత్నం చేయి. నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. (అద్దమును ఉపయోగించుకోవటం ఎలా అనే సాధనను కూడా పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్యగారు ఇచ్చారు.) ఇంత తీవ్రమయిన భావావేశము  నీకు ఉందా? అన్ని భావాలు అందరికి అవే పెట్టాడు దేముడు. ఒకరికి చిన్నగుండె ఒకరికి  పెద్దగుండె లేవు. సూర్యుని వేడి మహానుభావులను చల్లగా మమూలు వాళ్ళను వెచ్చగా తాకదు. వెన్నెల, పూలగంధం ఒకరికి చాలా అసహ్యంగా, ఒకరికి చాలా హాయిగా ఉండదు. అర్ధంకావటం అనే మాటకి అసలు అర్ధం లేదు.
You must felt before it is understood మామూలుగా ఎవరి ప్రేమో, కోపమో, ద్వేషమో మనల్ని తాకుతుంది. దానికి మనం స్పందిస్తాము. ఈ స్పందన కలిగించడంలో,expression తాలూకు perfection ఏమిటి అని దానిని విశ్లేషిస్తుంటారు విమర్శకులు. విమర్శని పాజిటివ్ గా అర్ధం చేసుకుంటే ఎదగటానికి అవకాశము ఉంటుంది. అర్ధం అంటే mind కి సంబంధించినది. భావం అంటే  ప్రాణానికి, చైతన్యానికి, హృదయానికి సంభంధించినది.  
"నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో" 
కన్నీటితో,feel తో కర్మను తీసేయవచ్చు. ఒక నవ్వు ఒక ఏడుపు భావాలన్నీ వెళ్ళిపోయిన తరువాత దాని వెనకాల ఏమి చెప్పామో అని వివరించగలగాలి. ఆ ఏడుపు నుండి ఏమి నేర్చుకున్నామో మనకు అర్ధం అవగలగాలి. దీనికంతటికి అర్ధం ఎందుకు చెప్తున్నానంటే  మనిషితనం తాలూకు తీవ్ర  భావావేశం  కాదు కావలసినది. చాలా మౌళికమైనటువంటి విషయంపట్ల అతి నిసితమైనటువంటి దృష్టితోటి ఏకాగ్రతతోటి చూస్తున్నటువంటి తపన, జ్వలన కావాలి. దీనికి రూపం ఇచ్చినప్పుడు గురువులకి మనం అద్భుతముగా అనిపిస్తాము.
భగవంతుని లేదా ప్రకృతి లేదా గురువుల బా, తాపత్రయము, కోరిక  ఒక్కటే.
అందరు కలసి ఒకటిగా ఉండాలని. జగమంతా ఒకే కుటుంబంగా రావాలని.
మారెళ్ళ శ్రీరామకృష్ణ మాస్టర్ గారు కర్మ సిద్ధాంతము మీద ఇచ్చిన  ప్రవచనములు, సిరివెన్నెల అంతరంగం నుండి ఈ విషయాలు గ్రహించబడినది.